prev next

Tuesday 21 September 2010

కొమరం పులి

Posted on 21:09 by Vennaravi

కొమరం పులి సినిమా చూసాను. సినిమా ఇంత చెత్తగా కూడా తీయచ్చా అనిపించింది. పవన్ కల్యాణ్ కి తల లేదా తల ఉండీ మెదడు పనిచేయడంలేదా ! లేకపోతె అసలు ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడు?. సినిమాలో విషయం లేదు ప్రతి పది నిమిషాలకు పెద్దబారు డైలాగులు. ఎందుకు డైలాగులు చెబుతున్నాడో అది ఎమిటో కూడా నరమానవుడి అర్దకావు. నోరుందికదా డబ్బింగ్ లో సరిచేసుకోవచ్చు అన్నట్లు లిప్స్ కదలకుండానే డైలాగులు వచ్చేస్తున్నాయి. పాటలు సమయం సందర్బం లేకుండా రెహమాన్ తో చెయించాం వాడుకోవాలి అన్నట్లు సమయం సందర్బం లేకుండా పాటలు. సినిమాలో పాటలకి డైలాగులు తప్ప వేరే విషయం లేదు. నాకు ఈ సినిమా బాలక్రిష్ట్న సినిమా అనిపించింది. NTR కుటంబానికి పోటీగా చిరంజీవి కుటుంబం కూడా ఫ్లాప్ ల కోసం పరితపిస్తోంది. ఇంతోటి సినిమాకి ’అల్లు శిరిష్’, మిగిలిన సినిమా రివ్యులు రాసేవాళ్ళు కలేక్షన్ల గురించి డప్పు. మహేష్ బాబు ప్రశంసలు. నెను ఫాలో అవుతున్న ఒక రివ్యు రాసే ఆయన 5/10 ఇచ్చాడు. నా రేటింగ్ ఐతే మాత్రం 2/10. అది కూడా ఎందుకంటే పాపం ఇంత చెత్త సినిమాకి మంచి ప్రొమోలు తయరుచేసిన టెక్నీషియన్స్ కోసం. రెహమాన్ సంగీతం కూడా సినిమాని కాపాడలేక పోయింది. ఈ పరాజయంలో రెహమాన్ పాత్ర కూడా గనంగా చెప్పుకోవాలి. కోట్లు తిసుకుని పాపం నిర్మాతని ఆర్పేసాడు. కామన్వెల్త్ గేమ్స్ కోసం రెహామాన్ చేసిన పాట బాగాలేదని విమర్శ వచ్చినప్పుడు నేను పట్టించు కోలేదు కాని ఇప్పుడు నిజమనిపిస్తుంది.